HNK: ప్రైవేట్ పాఠశాలల్లో చదివే జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్కి ఐజేయూ జర్నలిస్టు సంఘం జిల్లా నాయకులు వినతి పత్రం సమర్పించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గడ్డం కేశవమూర్తి, సాయి రాములు ఆధ్వర్యంలో సభ్యులు కలెక్టర్కు పలు సమస్యలపై విన్నవించారు.