TG: ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా సాగిస్తున్నామని చెప్పారు. ఈసారి మొక్కజొన్న దిగుబడి బాగా వచ్చినా కేంద్రం కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వానికి నష్టం వాటిల్లినా సరే రైతులకు అండగా ఉంటూ మొక్కజొన్నను తామే కొంటున్నట్లు సీఎం స్పష్టం చేశారు.