వేసవిలో తీవ్రమైన సూర్యరశ్మి వల్ల డీహైడ్రేషన్, వడదెబ్బ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా బాడీలో వేడి ఎక్కువైపోతుంది. అందుకే శరీరాన్ని చల్లబరిచే ఆహారాలను రోజువారీ డైట్లో చేర్చుకోవాలి. ముఖ్యంగా పుచ్చకాయ, కీరదోసకాయ, కర్బూజా వంటి పండ్ల రసాలు శరీరాన్ని చల్లబరుస్తాయి. అలాగే నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లలో ఉండే విటమిన్-C ఎండ దెబ్బ తగలకుండా కాపాడుతుంది.