SDPT: హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్రజావాణి దరఖాస్తుదారులు వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రజావాణిలో ఏళ్లుగా ఫిర్యాదులు చేస్తున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఫ్లెక్సీలతో ఆందోళన చేపట్టారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, దరఖాస్తులను నిర్లక్ష్యం చేస్తున్నారని కవ్వ వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. ప్రజావాణి ద్వారా సమస్యలు పరిష్కరించాలన్నారు.