TPT: తిరుపతి జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో కలిసి ప్రజల సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో పరిష్కార చర్యలపై చర్చించారు.