KKD: ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా అమలాపురంకు చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ పెచ్చెట్టి విజయలక్ష్మి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం పార్టీ అధిష్టానం నుంచి తనను నియమించినట్లు ప్రకటించారని ఆమె తెలిపారు. ఆమె ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.