MDK: జిల్లాలో రైతులు అధైర్యపడొద్దని, చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. ఇవాళ నర్సాపూర్‌లోని రైస్ మిల్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఎంసీఎస్ జగదీష్, డీఎస్వో నిత్యానంద్, తహశీల్దార్ శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు.