NDL: మహానంది దేవస్థానంలో ఈ నెల 29న హుండీ కానుకల లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో నల్ల కాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినప్పుడు వెల్లడించారు. స్థానిక అభిషేక మండపంలో జరిగే ఈ లెక్కింపు ప్రక్రియకు ఆలయ సిబ్బంది అందరు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.