ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా సోమవారం, మంగళవారం తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. ఏలూరు (D)లో 4, పశ్చిమగోదావరిలో 3 మండలాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భీమడోలులో 45 డిగ్రీలు, ఉంగుటూరులో 44.9, కొయ్యలగూడెంలో 44.8, ద్వారకాతిరుమలలో 44.5 డిగ్రీల ఎండ ఉంటుందని పేర్కొంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అన్నారు.