గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ అర్బన్ స్టేషన్ నూతన సీఐగా ఆర్ఎస్.కిషోర్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు సిసిఎస్ నుంచి సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడకు వచ్చినట్లు సీఐ తెలిపారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎల్.వీరనాయక్ను వి.ఆర్ కు పంపినట్లు సమాచారం. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది నూతన సీఐకి ఘన స్వాగతం పలికారు.