SS: పరిగిలోని చెరువు కట్ట క్రింద ఉన్న శ్రీ సప్త మాతృక పన్నాడమ్మ దేవస్థానం వద్ద భక్తుల సౌకర్యార్థం రెండు కుర్చీ దిమ్మెలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశాల మేరకు ప్రజల కోరికతో వృద్ధులు, గర్భిణీలు కూర్చోవడానికి ఈ ఏర్పాట్లు చేసినట్లు సోమవారం టీడీపీ మండల కన్వీనర్ గోవింద్ రెడ్డి తెలిపారు.