కోనసీమ: అమలాపురం రూరల్ మండలం ఇమ్మిడివరప్పాడు గ్రామంలో నూతన మంచినీటి వాటర్ ట్యాంక్‌ను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. గతంలో కోటి రూపాయలతో సీసీ రోడ్లు నిర్మించామని, ఇప్పుడు తాగునీటి సౌకర్యం కల్పించామని చెప్పారు. 2029లో కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు.