SRD: రోడ్లపై ధాన్యం ఆరబోస్తే చర్యలు తప్పవని సిర్గాపూర్ ఎస్సై మహేష్ హెచ్చరించారు. వాహనదారులు ధాన్యంపై జారీ ప్రాణాపాయానికి దారి తీస్తుందన్నారు. వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వం సూచించిన నిర్దిష్ట కల్లాలలోనే ధాన్యం ఆరబోసుకోవాలని సూచించారు. ప్రజల భద్రత కోసం ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని తెలిపారు.