SRCL: తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెళ్ళలో సోమవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో జీలుగు (ధైంచా) విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని PACS ఛైర్మన్ కోడూరి భాస్కర్ గౌడ్ ప్రారంభించారు. రైతులు సేంద్రియ ఎరువుల కోసం జీలుగు పంటను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి AEO గౌతమి, CEO కిషోర్‌తో పాటు రైతులు పాల్గొన్నారు.