MBNR: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచే లక్ష్యంతో సోమవారం మూసాపేట జెడ్పీహెచ్ఎస్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయ బృందంతో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్థానికులు కొండయ్య, సలాం, శ్రీను, పర్షవేది తదితరులు పాల్గొన్నారు.