ADB: జొన్నల కొనుగోలు విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని బోథ్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మల్లెపూల సత్యనారాయణ అన్నారు. సోమవారం సోనాల మండల కేంద్రంలోని జొన్నల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజలు కొనుగోలు చేస్తుందన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు.