నెల్లూరు నగర డివిజన్ల పునర్విభజన ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగుతోందని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ నేతలతో కలిసి ఆదివారం నగర కమిషనర్ నందన్‌ను కలిసి డీలిమిటేషన్‌పై తమ అభ్యంతరాలను రాతపూర్వకంగా సమర్పించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు చేయాలని కోరారు. తమ సూచనలను పట్టించుకోకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు.