ATP: CM చంద్రబాబు అధ్యక్షతన వర్చువల్ విధానంలో జరగనున్న పసుపు పండుగ మహనాడులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి పిలుపునిచ్చారు. ఈ డిజిటల్ సభను విజయవంతం చేయాలని కోరారు. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై మహనాడును గ్రాండ్ సక్సెస్ చేయాలని, పార్టీ బలోపేతానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ఆమె ఆకాంక్షించారు.