SS: హిందూపురం ఎంపీ బి.కె. పార్థసారథి ఇవాళ వేకువజామున తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆయనతో పాటు మాజీ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి, యల్లనూరు సింగల్ విండో అధ్యక్షుడు అనిల్ కుమార్ చౌదరి కలియుగ దైవాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.