KRNL: జిల్లాలో పోలీసు అధికారులకు, సిబ్బందికి హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు సూచనలు, డీజీపీ హరీష్‌కుమార్ ఆదేశాలతో ఎస్పీ విక్రాంత్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యోగా, ప్రాణాయామం, ధ్యానంతో ఒత్తిడి తగ్గి విధుల్లో సమర్థత పెరుగుతుందని శిక్షకులు తెలిపారు.