AKP: రోలుగుంటలో వీధికుక్కల దాడులు మితిమీరాయి. జనవరి నుంచి 92 కేసులు నమోదయ్యాయి (జనవరి-18, ఫిబ్రవరి-16, మార్చి-22, ఏప్రిల్-20, మే-16). చిన్నపిల్లలు, ఇళ్లలో పడుకున్నవారిపై దాడులు జరగడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. PHC వైద్యాధికారిణి వెంకట శ్రావణి స్పందిస్తూ ఆందోళన వద్దని, ఆసుపత్రిలో 300పైగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయన్నారు.