SKLM: గార (M) అంపోలు గ్రామానికి చెందిన మాజీ MPTC సభ్యుడు ఎ. తవుడు (77) ఆదివారం మధ్యాహ్నం వడదెబ్బకు గురై మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో గ్రామంలో చెట్టుకింద కూర్చున్న తవుడు, వడదెబ్బకు గురై నీరసంగా ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే మృతి చెందారని పేర్కొన్నారు. గ్రామస్తులు కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.