NTR: విజయవాడ హనుమాన్పేటలోని బెజవాడ బార్ ముందు నడిరోడ్డుపై రెండు మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. శవాలు పడి ఉన్నా కొంతసేపు ఎవరూ పట్టించుకోకపోవడంతో స్థానికులు, ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి, నగరపాలక సంస్థ అధికారులకు తెలియజేశారు. మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకొని మృతదేహాలను తొలగించారు.