WGL: సంగెం మండలం మొండ్రాయికి చెందిన ప్రవీణ్‌కుమార్‌కు ఆదివారం రాత్రి ఇంటి వద్ద పాము కాటేయడంతో, ఆ పామునే బాటిల్లో బంధించి ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చిన ఘటన కలకలం రేపింది. పామును చూసిన వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం పరీక్షలు నిర్వహించగా అది విషరహిత పాముగా తేలింది. దీంతో ప్రవీణ్‌కుమార్‌కు ప్రథమ చికిత్స అందించి వైద్యులు పంపించారు.