AP: రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరి మండలం నిడమర్రు జెడ్పీ హైస్కూల్ అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంది. రాష్ట్రంలోనే తొలి ప్రభుత్వ ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్‌గా నిలిచిన ఈ ప్రాంగణాన్ని 5.2 ఎకరాల విస్తీర్ణంలో, రూ.16 కోట్లతో జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి ఆధునికీకరించారు. మంత్రి లోకేష్ చొరవతో ఈ పాఠశాలను జూన్ రెండో వారంలో ప్రారంభించనున్నారు.