HNK: జిల్లా నూతన కలెక్టర్గా చాహత్ బాజ్పాయ్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు వరంగల్ మహానగర పాలక సంస్థ (GWMC) కమిషనర్గా సేవలు అందించిన ఆమెను ప్రభుత్వం కలెక్టర్గా నియమించింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లా సమగ్ర అభివృద్ధికి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు.