కోనసీమ: రామచంద్రపురంలో ఈ నెల 28న 43వ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయం తెలిపింది. కెవిఆర్ హాస్పిటల్ వెనుక ఉపాధి కార్యాలయంలో జరిగే ఈ మేళాలో ఎయిర్టెల్ ఫైబర్ నెట్లో హెచ్డీవో ఇంజనీర్, వైర్మెన్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. పదో తరగతి, డిగ్రీ, బీటెక్ ఈసీఈ, ఈఈఈ చదివిన 30 ఏళ్లలోపు పురుష అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు.