ప్రకాశం: అంతర్జాతీయంగా పొగాకు తగ్గిన డిమాండ్ పెరిగిన జీఎస్టీ ధరలతో పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొండపి పొగాకు వేలం కేంద్రంలో శనివారం నిర్వహించిన పొగాకు వేలం నిరాశ జనకంగా ముగిసింది. 60 శాతానికి పైగా తిరస్కరణకు గురి కావడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.