NZB: రైల్వే పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా కోర్టు డ్యూటీ చేసే చిన్న జాన్ (55) హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందినట్లు NZB రైల్వే SI సాయిరెడ్డి తెలిపారు. వారం క్రితం వడదెబ్బకు గురై చికిత్స పొందుతుండగా గుండెపోటు వచ్చిందన్నారు. అంత్యక్రియల కోసం మృతుని కుమారుడికి రైల్వే డీఎస్పీ శ్రీనివాస్ రూ.30 వేలు ఆర్థిక సహాయం అందజేశారన్నారు.