GDWL: కేటీదొడ్డి మండలం సుల్తానురం గ్రామ పరిసరాల్లో అక్రమంగా కోడిపందాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎస్సై పగడాల శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 3 పందెం కోళ్లు, 2 బైకులు, రూ. 1,150 నగదు స్వాధీనం చేసుకున్నారు.