సత్యసాయి: పోతుకుంట గ్రామంలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ పారిశుధ్య కార్యక్రమాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. జూన్ 20 వరకు జరిగే ఈ ప్రచారంలో పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తామన్నారు. స్వచ్ఛ భారత్ వల్ల రోగాలు, పేదల ఆసుపత్రి ఖర్చులు తగ్గాయని చెప్పారు. సుందర ధర్మవరం కోసం ప్రజలు చెత్తను తడి, పొడిగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి ఇవ్వాలని సూచించారు.