ATP: నెల రోజుల యాక్షన్ ప్లాన్‌తో అనంతపురం నగరాన్ని పరిశుభ్రంగా మారుస్తామని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం ఉదయం సూర్యనగర్ రోడ్డులో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి కాలనీలో చెత్త సేకరణ సమయాన్ని ముందే ప్రకటిస్తామని, ప్రజలు సహకరించాలని కోరారు.