మన్యం జిల్లాలోని విద్యావంతులైన బధిరులకు ఉచితంగా టచ్ మొబైల్ ఫోన్లు పంపిణీ చేయనున్నట్టు జిల్లా విభిన్న ప్రతిభా వంతుల సంక్షేమ శాఖాధికారి బి.దేవరాజు తెలిపారు. సమాచార మార్పిడికి, అత్యవసర పరిస్థితుల్లో ఇవి ఉప యోగపడతాయన్నారు. 18 నుంచి 40 ఏళ్లలోపు వయసు ఉండి, ఇంటర్మీడియట్ ఆపై చదువులు చదువుతున్న, పూర్తి చేసిన బధిరులు ఈ పథకానికి అర్హులన్నారు.