MDK: జిల్లాలో పారదర్శక ఓటర్ల జాబితా తయారీ లక్ష్యమని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. రాజకీయ పార్టీలతో ప్రత్యేక సవరణపై సమీక్ష నిర్వహించారు. జూన్ 15 నుంచి ప్రక్రియ ప్రారంభమై అక్టోబర్ 1న తుది జాబితా విడుదల అవుతుంది. బీఎల్వోలు ఇంటింటి సర్వే చేసి మార్పులు చేస్తారు. 18 ఏళ్లు నిండిన యువత ఫామ్-6 ద్వారా నమోదు కావాలన్నారు.