ATP: తాడిపత్రి నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాల వల్ల మొత్తం 47 విద్యుత్ స్తంభాలు, కండక్టర్లు దెబ్బతిన్నట్లు ట్రాన్స్ కో ఏడీఈ ప్రభాకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో తాడిపత్రి టౌన్ పరిధిలో 13, రూరల్ పరిధిలో 22, యాడికి మండలంలో 12 స్తంభాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం టౌన్ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.