ELR: జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన 820 బస్సులను తనిఖీ చేసి, లోపాలున్న వాటికి నోటీసులు ఇచ్చినట్లు ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ తెలిపారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 5 ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 25వ తేదీ లోపు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోకపోయినా, వాహనాల్లోని లోపాలను సరిచేసుకోకపోయినా ఆయా స్కూల్ బస్సులను సీజ్ చేస్తామన్నారు.