KDP: ప్రొద్దుటూరు స్థానిక శ్రీనివాసనగరుకు చెందిన గజ్జపనేని సంజీవమ్మ(60) బుధవారం నుంచి కనిపించడం లేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు టూటౌన్ SI మహబూబ్ బాషా తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు CI (9121100590), ఎస్ఐ (9121100591) నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.