ADB: ఆదిలాబాద్ పట్టణంలోని కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ శుక్రవారం తెలిపారు. విద్యార్థులను మెరిట్, కేంద్రీయ విద్యాలయ నిబంధనలను అనుసరించి ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు జిల్లా కేంద్రంలోని విద్యాలయాన్ని సందర్శించాలని సూచించారు.