WGL: కాజీపేట మండలం టేకులగూడెం గ్రామంలో శుక్రవారం రాత్రి WGL పోలీస్ కమిషనరేట్ జాగృతి కళాబృందం ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణాపై గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాబృందం ఆట, పాటలతో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథిగా CI కిషన్ హాజరై, మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.