దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో కూడా ఇదే ట్రెండ్ రిపీట్ కానుంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి ప్రధాన హీరోయిన్గా నటిస్తుండగా.. ‘అల వైకుంఠపురములో’ మెరిసిన నివేదాను సెకండ్ హీరోయిన్గా ఫైనల్ చేసినట్లు టాక్.