W.G: ఉండి మండలం ఉనుదుర్రు గ్రామానికి చెందిన మద్దాల శ్రీరాములు(55) అనే వ్యక్తి మంచినీటి చెరువులో పడి మృతి చెందారు. పోలీసులు ఇచ్చిన వివరాలు ప్రకారం.. శ్రీరాములు తెల్లవారి జామున పొలం పనులుచూసుకుని తిరిగి వచ్చే సమయంలో కాళ్లు చేతులు ముఖం కడుక్కోవడానికి చెరువులోకి దిగగా కాలుజారి పడిపోయినట్లు తెలిపారు. ఈత రాకపోవడంతో మృతి చెందాడు ఆయన కుమారుడు సాయి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.