RR: ఆకునూరి మురళి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. రాష్ట్ర విద్యా వ్యవస్థపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విద్యా రంగంలో సంస్కరణలు, విధాన సూచనలతో కూడిన నివేదికను కమిషన్ ఇటీవల సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేసింది.