గత దశాబ్దంలో మహిళల క్రికెట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. 2025 మహిళల ప్రపంచ కప్‌కు లభించిన అపూర్వ వీక్షకాదరణ, రికార్డు స్థాయి ప్రైజ్ మనీ రూ.3.88 మిలియన్లు దీనికి నిదర్శనం. ఐసీసీ ఛైర్మన్ జై షా నేతృత్వంలో మహిళల క్రికెట్ విస్తరణకు కీలక చర్యలు చేపట్టాడు. ఇందులో భాగంగా నవంబర్ 2026లో 10 జట్లతో ‘ఉమెన్స్ ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీ’ని నిర్వహించనున్నారు.