AP: రాష్ట్రంలో పెరిగిన ఎండల తీవ్రత, హీట్‌వేవ్ పరిస్థితులపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. టెంట్లు, చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని.. ప్రజలకు చల్లని నీరు, మజ్జిగ, ORS అందించాలని సూచించారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.