NGKL: పదర మండలంలో రేపు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పర్యటించనున్నట్లు కాంగ్రెస్ నేత మాణిక్యం, జిల్లా నాయకుడు ఎడ్ల ఆనంద్ తెలిపారు. మండల రైతు వేదికలో వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతుల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.