ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, సౌందర్య, వినీత ప్రధాన పాత్రల్లో నటించిన క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు’ విడుదలై నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. అద్భుతమైన కామెడీ, కోట శ్రీనివాసరావు నటన, ఇప్పటికీ ఎవర్గ్రీన్ గా నిలిచిన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూనే ఉన్నాయి. ఎన్నిసార్లు చూసినా ఈ చిత్రం బోర్ కొట్టదు.