HYD: రాంగోపాల్‌పేట్ డివిజన్ పరిధి ఆవుల మండిలో రూ.12 లక్షలు, కలాసిగూడలో రూ.9.65 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ పైప్‌లైన్ పనులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ పనుల ద్వారా స్థానిక ప్రాంతాల్లో పారిశుధ్య వసతులు మెరుగుపడి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందనున్నాయని తెలిపారు.