BHNG: రాజాపేట మండలంలోని రఘునాధపురం వాగులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లను తహసీల్దార్ వల్లపు ప్రదీప్ బృందం ఇవ్వాళ మధ్యాహ్నం పట్టుకుంది. డ్రైవర్లు పూర్మ రాజేష్, వేముల చందును పోలీసులకు అప్పగించగా, ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.