KDP: కలకడ మండలం కదిరాయచెరువు గ్రామ పంచాయతీలో చేపడుతున్న క్యాటిల్ షెడ్ పనులను పీడీ వెంకటరత్నం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని వేతనదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వలసలకు వెళ్లకుండా స్థానికంగానే ఉపాధి పనులకు హాజరుకావాలని కోరారు. ఉపాధి కూలీలకు బిల్లులు సకాలంలో జమ అవుతున్నాయని తెలిపారు. పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.