గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద గ్రీన్ మ్యాట్ షెడ్లు, ఉచిత తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రజలు ఉదయం 11 గంటల తర్వాత బయటకు రావొద్దని, తగినంత నీరు తీసుకుంటూ వడదెబ్బ నివారణ చర్యలు పాటించాలని అధికారులు సూచించారు.